Anand Mahindra: ఈ వీడియో ఎక్కడిదో నాకు తెలియదు కానీ అద్భుతం!: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra shares a video of true elegance
  • పాలు తిరగ్గొట్టడంలో ఓ యువకుడి నైపుణ్యం
  • అచ్చెరువొందిన ఆనంద్ మహీంద్రా
  • రేపటి పట్ల ఆశను కలిగిస్తోందంటూ ట్వీట్
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏ మూలన ఉన్నా ఇట్టే పట్టేస్తారు. తాజాగా, ఓ మతపరమైన ప్రదేశంలో వేడిపాలు తిరగ్గొడుతున్న యువకుడి వీడియోను ఆనంద్ పంచుకున్నారు. ఈ వీడియోలోని యువకుడు ప్రదర్శిస్తున్న నైపుణ్యం, చురుకుదనం ఈ దిగ్గజ వ్యాపారవేత్తను ముగ్ధుడ్ని చేశాయి.

దీనిపై ఆయన ట్వీట్ చేశారు. "ఈ వీడియో ఎక్కడ్నించి వచ్చిందో నాకు తెలియదు కానీ అద్భుతం. నావరకైతే అతడి లాఘవం, శక్తి, ఉత్సాహం రేపటి పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తున్నాయి. ధన త్రయోదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.
Anand Mahindra
Video
Elegance
Social Media

More Telugu News