‘ఆర్ఆర్ఆర్’ నుంచి దీపావళి గిఫ్ట్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ ఫొటోలు విడుదల!

13-11-2020 Fri 12:18
  • 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందం దీపావళి సెలబ్రేషన్స్
  • చెర్రీ, ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి సంభాషణ
  • తెలుపు రంగు దుస్తుల్లో చెర్రీ, తారక్ ఫొటోలకు పోజులు
rrr new pic releases

'బాహుబలి' సినిమా అనంతరం దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందం దీపావళి సందర్భంగా పలు ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తోన్న రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి సంభాషణ జరుపుతున్న సందర్భంలోనివి ఈ ఫొటోలు. చిరునవ్వులు చిందిస్తూ వారు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను ఆర్ఆర్ఆర్ టీమ్ పోస్ట్ చేసింది.
   
తెలుపు రంగు దుస్తుల్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కనపడ్డారు. సినిమా గురించి తారక్, చెర్రీకి రాజమౌళి వివరిస్తున్నట్లు ఓ ఫొటో ఉంది. వారి ముగ్గురి వెనుక ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు కనపడుతున్నాయి. రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ పేర్లు కలిసేలా ఈ సినిమా పేరు పెట్టిన విషయం తెలిసిందే.
    
చెర్రీ, తారక్ కలిసి, అలాగే విడివిడిగా కూడా ఫొటోలకు పోజులిచ్చారు. కాగా, ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన  ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’, ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు అలరించిన విషయం తెలిసిందే. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ ఈ టీజర్లలో అలరించారు.