Payal Rajput: మద్యం బ్రాండ్ కు పాయల్ ప్రచారం... మందు గ్లాస్ పట్టుకుని వున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్!

- చేతిలో మందు గ్లాసుతో ఆనందంలో పోజ్
- ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పాయల్ రాజ్ పుత్
- ఇలా నటించడం ఏంటని ప్రశ్నిస్తున్న నెటిజన్లు
'ఆర్ ఎక్స్ 100' చిత్రంలోని తన బోల్డ్ యాక్టింగ్ తో ఎంతో మంది కుర్రాళ్ల హృదయాల్లో తిష్ట వేసుకున్న పాయల్ రాజ్ పుత్, ఓ మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేసిన పిక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు మందు బాటిల్.. చేతిలో మందు గ్లాస్ పట్టుకుని, ఆనందాన్ని పొందుతున్న పాయల్, తన పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేయగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.