'నా ప్రియమైన రాజా..' అంటూ భర్తకు విషెస్ చెప్పిన యాంకర్ సుమ

13-11-2020 Fri 11:00
  • నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు
  • నీవే నా బలం.. సంతోషం
  • నీతో కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చాడు
  • నీతో  జీవించే ప్రతిరోజు ఓ కొత్త రోజులా ఉండాలి
Suma Kanakala  My dearest raja a very very very happy birthday to you

తన భర్త, సినీనటుడు రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా యాంకర్ సుమ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. రాజీవ్‌పై తనకున్న ప్రేమాభిమానాలను ఆమె ఇందులో స్పష్టంగా  వెల్లడించింది. 'నా ప్రియమైన రాజా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీవే నా బలం.. సంతోషం. నీతో కలిసి జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని నాకు దేవుడిచ్చాడు. నీతో కలిసి జీవించే ప్రతిరోజు ఓ కొత్త రోజులా ఉండాలని నేను భావిస్తున్నాను. లవ్ యూ. నువ్వు, నేను ఒక్కటే నా ప్రియమైన రాజీవ్ కనకాల’ అని సుమ పేర్కొంది.
 
తన భర్తతో కలిసి గతంలో తీసుకున్న ఫొటోను రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా సుమ పోస్ట్ చేసింది. మరోవైపు రాజీవ్ కనకాల, సుమ విడిపోయినట్టు ఇటీవలి కాలంలో వదంతులు వచ్చాయి.  ఈ నేపథ్యంలో, తమ అనుబంధం ఎంత గొప్పదో చెబుతూ సుమ చేసిన ట్వీట్ అభిమానులను అలరిస్తోంది. సుమకు భర్తతో విభేదాలు వచ్చాయంటూ వస్తోన్న ప్రచారాన్ని తోసిపుచ్చేలా ఇప్పటికే సుమ పలు ఫొటోలు పోస్ట్ చేసింది.