ప్రఖ్యాత రెజ్లర్ 'అండర్ టేకర్'తో రానా చాట్... పొగడ్తల వర్షం కురిపించిన మిహీకా!

13-11-2020 Fri 10:17
  • యూట్యూబ్ చానెల్ లో రానా 'వైఆర్యూ' షో 
  • ఇటీవల అండర్ టేకర్ తో చాటింగ్
  • తన భర్త కూలెస్ట్ అంటున్న మిహీకా
Miheeka Praises Rana

తన సొంత యూట్యూబ్ చానెల్ లో 'వైఆర్యూ' అనే షోను నిర్వహించాలని నిర్ణయించుకున్న నటుడు రానా, తన షో కోసం ఎందరో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయనున్నారు. అందులో భాగంగా ప్రముఖ రెజ్లర్, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అండర్ టేకర్ (మార్క్ విలియం కాలావే)తోనూ మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసమే అండర్ టేకర్, రానాల మధ్య చాటింగ్ జరిగిందా? అనే విషయంపై స్పష్టత లేకున్నా, అండర్ టేకర్ తో చాటింగ్ అద్భుతమంటూ రానా ఓ పిక్ ను షేర్ చేశారు.

ఇక ఇదే పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన రానా భార్య మిహీకా బజాజ్, భర్తపై పొగడ్తల వర్షం కురిపించింది. తన భర్త కూలెస్ట్ అంటూ కితాబునిచ్చింది. వీరిద్దరూ కరోనా సమయంలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత మిహీకా, పెద్దగా ఫ్యాన్స్ తో ఏ విషయాలనూ పంచుకోలేదు. హనీమూన్ సమయంలో మాత్రం ఓ పిక్ ను షేర్ చేసింది.