బిగ్ బాస్ వేదికపై నాగ్ తో పాటు చైతూ కూడా!

13-11-2020 Fri 08:22
  • సరదాగా సాగుతున్న బిగ్ బాస్
  • ఇప్పటికే కంటెస్టెంట్లను పలకరించిన పలువురు సెలబ్రిటీలు
  • ఈ వీకెండ్ లో వేదికపైకి రానున్న నాగ చైతన్య
Naga Chaitanya in Biggboss Stage this Weekend

బిగ్ బాస్ తెలుగు సీజన్ కాసేపు సరదాగా, కాసేపు సీరియస్ గా సాగిపోతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే యాంకర్ సుమతో పాటు అఖిల్, సమంత తదితరులు గెస్టులుగా వచ్చి సందడి చేశారు. ఇక, బిగ్ బాస్ సీజన్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటున్న వేళ, ఈ వారాంతంలో నాగ్ తో పాటు నాగ చైతన్య కూడా స్టేజ్ పై అలరించనున్నారని అంటున్నారు.

గత వారంలో చిరంజీవికి కరోనా వచ్చిందంటూ ఆయన హోమ్ క్వారంటైన్ కు వెళ్లడం, అంతకు రెండు రోజుల ముందే నాగార్జున, చిరంజీవి కలవడంతో, నాగ్ సైతం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే, నాగ్ కు నెగటివ్ వచ్చింది. దీంతో ఆయన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ చిత్రీకరణలో పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక, ఈ వారాంతంలో నాగ చైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో వాస్తవం తెలియాలంటే, రేపటి వరకూ ఆగాల్సిందే.