సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

13-11-2020 Fri 07:46
  • బాలీవుడ్ లో బిజీగా వున్న తాప్సి 
  • మరో ద్విభాషా చిత్రంలో ఆది పినిశెట్టి
  • సంచలన వాణిజ్య ప్రకటనలో పాయల్
Tapse busy in Hindi films

*  కథానాయిక తాప్సి హిందీ సినిమాలలో బిజీగా వుంది. ఇప్పటికే 'హసీనా దిల్ రుబా' చిత్రం షూటింగును పూర్తిచేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా 'రష్మీ రాకెట్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈ చిన్నది మారథాన్ రన్నర్ గా నటిస్తోంది. 
*  తాజాగా 'గుడ్ లుక్ సఖి' సినిమాలో హీరోగా నటించిన ఆది పినిశెట్టి త్వరలో మరో ద్విభాషా చిత్రాన్ని చేయనున్నాడు. ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తారు. ఇందులో మరో హీరో జై కూడా నటిస్తాడు.
*  'ఆర్ ఎక్స్ 100' చిత్రం ద్వారా సెక్సీ తారగా పేరుతెచ్చుకున్న కథానాయిక పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ లిక్కర్ బ్రాండుకి ప్రచారకర్తగా మారింది. చేతిలో రాయల్ ఛాలెంజ్ విస్కీ గ్లాసుతో ఆమె ఈ బ్రాండుకి చేస్తున్న ప్రచారం సంచలనం అవుతోంది.