తనయుడితో కలసి నాగార్జున మల్టీ స్టారర్?

12-11-2020 Thu 21:17
  • ప్రస్తుతం 'వైల్డ్ డాగ్'లో నటిస్తున్న నాగార్జున 
  • తాజాగా కథ వినిపించిన అనిల్ రావిపూడి 
  • నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్ 
  • తనయుడు అఖిల్ ఓ హీరోగా నటించే అవకాశం
Nagarjuna multi starer with his son on cards

ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' సినిమాలో నటిస్తూ.. మరోపక్క 'బిగ్ బాస్ 4' రియాలిటీ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున త్వరలో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్టు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే, ఇందులో ఆయన తనయుడు అఖిల్ కూడా ఓ కథానాయకుడుగా నటిస్తారని సమాచారం. 

ఇటీవల మహేశ్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరూ' హిట్ చిత్రాన్ని చేసిన అనిల్ రావిపూడి ఈ క్రేజీ ప్రాజక్టుకి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇటీవల నాగార్జునను కలసిన అనిల్ రావిపూడి దీనికి సంబంధించిన కథను వినిపించాడట. నాగార్జునకు ఈ కథ బాగా నచ్చిందని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. 

గతంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలంతా కలసి 'మనం' చిత్రంలో నటించిన సంగతి మనకు తెలిసిందే. అది వినూత్నమైన కథాచిత్రంగా పేరుతెచ్చుకుని, ప్రేక్షకాదరణ కూడా పొందింది. ఇప్పుడు నాగార్జున, అఖిల్ చిత్రం కార్యరూపం దాలిస్తే కనుక అక్కినేని ఫ్యామిలీ అభిమానులకు ఇక పండగే!