Vamsy Rajesh: కరోనా మహమ్మారికి బలైన టాలీవుడ్ యువ రచయిత

Tollywood young writer Vamsy Rajesh dies of corona
  • అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రానికి కథ అందించిన వంశీ రాజేశ్
  • ఇటీవల కరోనా బారినపడిన వైనం
  • చికిత్స పొందుతూ కన్నుమూత
రవితేజ హీరోగా వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంతో స్టోరీ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ రచయిత వంశీ రాజేశ్ కన్నుమూశారు. ఇటీవలే కరోనా బారినపడిన వంశీ రాజేశ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. గత రెండు వారాలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ దశలో కోలుకుంటున్నట్టే అనిపించినా, అకస్మాత్తుగా పరిస్థితి విషమించింది. దాంతో కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను విషాదంలో ముంచెత్తుతూ వంశీ రాజేశ్ తుదిశ్వాస విడిచారు.

ఈ యువ రచయిత మృతితో టాలీవుడ్ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల స్పందిస్తూ, ఎంతో ప్రతిభ ఉన్న వంశీ రాజేశ్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. వంశీ రాజేశ్ తో ఎన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయని, అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.

వంశీ రాజేశ్ 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం తర్వాత పలు చిత్రాలకు కథా విభాగంలో పనిచేశారు. దర్శకుడు అవ్వాలని కోరుకున్న వంశీ రాజేశ్ కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. అంతలోనే ఇలా జరగడం బాధాకరం.
Vamsy Rajesh
Corona Virus
Death
Writer
Tollywood

More Telugu News