ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు ఆసిఫ్ బస్రా

12-11-2020 Thu 18:14
  • ధర్మశాలలో ఉరి వేసుకున్న ఆసిఫ్ బస్రా
  • కొంత కాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు సమాచారం
  • ఆసిఫ్ వయసు 53 సంవత్సరాలు
Film actor Asif Basra was found hanging in a private complex in Dharamshala

మరో నటుడు ఆత్మహత్యకు పాల్పడటం బాలీవుడ్ లో విషాదం నింపింది. సీనియర్ నటుడు ఆసిఫ్ బస్రా ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ లో ఉరివేసుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. పెంపుడు కుక్క గొలుసుతో ఆయన ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన వయసు 53 సంవత్సరాలు.

 ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా ఆయన డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలిని ఫోరెన్సిక్ నిపుణులు కూడా పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఆసిఫ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కాగా, బ్లాక్ ఫ్రైడే, పర్జానియా, జబ్ వీ మెట్, వన్స్ అపానే టైమ్ ఇన్ ముంబై, క్రిష్ 3 వంటి పలు హిందీ సినిమాలలో నటించిన ఆసిఫ్.. తమిళ, మలయాళ, గుజరాతీ చిత్రాలలో కూడా నటించారు.