Arya: అల్లు అర్జున్ కి విలన్ గా ప్రముఖ తమిళ నటుడు!

Arya as villain in Allu Arjuns Pushpa
  • మొదట్లో 'పుష్ప' విలన్ గా విజయ్ సేతుపతి ఎంపిక 
  • డేట్స్ సమస్యతో తప్పుకున్న విజయ్ సేతుపతి
  • తాజాగా 'వరుడు' ఫేమ్, తమిళ నటుడు ఆర్య ఎంపిక
  • మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న షూటింగ్   
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రంలో నటించే విలన్ ఎవరన్న విషయమై గత కొన్నాళ్లుగా సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట్లో తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఈ పాత్రకు బుక్ చేశారు. అయితే, తర్వాత డేట్స్ సమస్య రావడంతో ఆయన తప్పుకున్నాడు.

ఆ తర్వాత ఒకరిద్దరు తమిళ, హిందీ నటుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ పాత్రకు తమిళ నటుడు ఆర్య పేరు తెరపైకి వచ్చింది. గతంలో బన్నీ నటించిన 'వరుడు' సినిమాలో ఆర్య విలన్ గా నటించాడు. ఇప్పుడతను 'పుష్ప'కు కూడా ఫైనల్ అయ్యాడని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆర్య సుపరిచితుడు కావడం వల్ల అతనినే తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఇదిలావుంచితే, లాక్ డౌన్ గ్యాప్ అనంతరం ఈ చిత్రం షూటింగును తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నాడు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. లారీ డ్రైవర్ స్థాయి నుంచి ఎర్రచందనం దుంగల స్మగ్లర్ గా ఎదిగిన పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపిస్తాడని సమాచారం.
Arya
Allu Arjun
Sukumar
Rashmika Mandanna

More Telugu News