Donald Trump: 15 ఏళ్ల వైవాహిక జీవితానికి మెలానియా ముగింపు.. ట్రంప్‌కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధం!

Melania Trump ready to divorce to Donald trump

  • విడాకుల కోసం క్షణాలు లెక్కపెట్టుకుంటున్న మెలానియా
  • అవసరాల కోసమే వారిద్దరూ కలిసి ఉన్నారన్న ట్రంప్ మాజీ సహాయకురాలు
  • విడాకుల విలువ రూ. 500 కోట్లకు పైనేనని అంచనా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్‌కు భార్య మెలానియా ట్రంప్ షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ‘డెయిలీ మెయిల్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి చరమగీతం పాడేందుకు మెలానియా సిద్ధంగా ఉన్నారని, ఆ క్షణాల కోసం ఆమె ఎదురుచూస్తున్నారని పేర్కొంది.

ఈ మేరకు ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్‌ను ఉటంకిస్తూ కథనం రాసుకొచ్చింది. ట్రంప్, మెలానియాలు ఇద్దరూ ఒకరి అవసరాల కోసం మరొకరు కలిసి ఉన్నారని, నిజానికి వారి మధ్య భార్యాభర్తల బంధం లేనే లేదని ఒమరోసా చెప్పినట్టు పేర్కొంది. ట్రంప్‌కు విడాకులు ఇచ్చేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఈ విడాకుల విలువ 68 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 500 కోట్లుపైనే) ఉంటుందని అంచనా.

ట్రంప్, మెలానియాకు 14 ఏళ్ల కుమారుడు బారన్ ఉన్నాడు. కాబట్టి మెలానియాకు అందే ప్రాథమిక కస్టోడియల్ హక్కులన్నీ లభిస్తాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తన తొలి భార్యకు 14 మిలియన్ డాలర్లు, రెండో భార్యకు 2 మిలియన్ డాలర్లు భరణంగా ఇవ్వగా, మెలానియాతో విడాకులంటూ జరిగితే వారిద్దరి కంటే అత్యధికంగా 68 మిలియన్ డాలర్లు ఇచ్చుకోవలసి ఉంటుందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.

Donald Trump
Melania Trump
Divorce
america
  • Loading...

More Telugu News