Varla Ramaiah: అప్పుడు ఎస్వీబీసీ మాజీ చైర్మన్ బూతు బాగోతం.. ఇప్పుడు దాన్ని తలదన్నే ఘటన: వర్ల రామయ్య

varla slams subbareddy

  • సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఘటనలు
  • కొండపై రాజకీయ జోక్యం పెరిగిoది
  • టీటీడీ చైర్మన్ పదవికి సుబ్బారెడ్డి రాజీనామా చేయాలి

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీబీసీలో అశ్లీల వీడియోల లింక్‌ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎస్వీబీసీలో వరుసగా చోటు చేసుకుంటోన్న పరిణామాలపై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

‘టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేవస్థానం ప్రాశస్త్యం మసక బారుతోంది. కొండపై  రాజకీయ జోక్యం పెరిగిoది. ఎస్వీబీసీ మాజీ  చైర్మన్ బూతు బాగోతం మరవక ముందే, దాని తలతన్నిన బూతు పంచాంగం వెలుగులోకి రావడం ఘోరం. సుబ్బారెడ్డి గారు బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి’ అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Varla Ramaiah
Telugudesam
YV Subba Reddy
TTD
  • Loading...

More Telugu News