Rohit Sharma: ‘ఐపీఎల్ 2020’ విజేతగా తమ జట్టు నిలవడంపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

rohit on his victory

  • ఈ సీజన్‌ మొత్తం గొప్పగా శ్రమించాం
  • విజయాలను అలవాటుగా మార్చుకోవాలని ఆరంభంలో చెప్పాను
  • మా టీమ్ ఆటగాళ్లు దానిని చేసి చూపించారు
  • బాగా ఆడాలని బెత్తం పట్టుకుని చెప్పే రకం కాదు నేను  

ఐపీఎల్ 2020 ఫైనల్లో  డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్  విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ముంబయి జట్టు 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించడం పట్ల, ఈ సీజన్‌లో తమ ప్రదర్శన పట్ల ముంబయి కెప్టెన్‌ రోహిత్ శర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  

ఈ సీజన్‌ మొత్తం గొప్పగా శ్రమించామని, ఈ విజయంలో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇది తనకు గొప్ప అనుభూతి అని చెప్పాడు. విజయాలను అలవాటుగా మార్చుకోవాలని టోర్నీ ఆరంభంలో తాను చెప్పానని, తమ టీమ్ ఆటగాళ్లు దానిని చేసి చూపించారని అన్నాడు.

తాము మొదటి నుంచి టైటిల్ లక్ష్యంగానే ఆడామని,  సీజన్‌ మొత్తం తమకు అనుకూలంగా సాగిందని చెప్పాడు. తాను బెత్తం పట్టుకుని బాగా ఆడమని చెప్పే రకం కాదని, జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా తన పని అని చెప్పుకొచ్చాడు. జట్టులో అందరూ బాగా ఆడుతుండటంతో ఎప్పటికప్పుడు  తుది జట్టును మార్చుకునే సౌలభ్యం తమకు కలిగిందని తెలిపాడు. ఇషాన్ కిషన్‌, సూర్యకుమార్ చాలా బాగా ఆడారని తెలిపాడు.

Rohit Sharma
Cricket
IPL 2020
  • Loading...

More Telugu News