Telangana: 2021లో సెలవుల జాబితా... తెలంగాణ అధికారిక ప్రకటన!
- 28 సాధారణ సెలవులు
- మరో 25 ఐచ్ఛిక సెలవులు
- ఉత్తర్వులు జారీ చేసిన సోమేశ్ కుమార్
2021లో సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 28 సాధారణ సెలవు దినాలతో పాటు 25 ఐచ్ఛిక సెలవు దినాలను ప్రకటిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే సంవత్సరం అన్ని ప్రభుత్వ ఆఫీసులూ రెండో శనివారాలు, ఆదివారాలు మూసి వుంటాయని, ఉద్యోగులు ముందుగా దరఖాస్తుచేయడం ద్వారా ఐదు ఐచ్ఛిక సెలవులను వాడుకోవచ్చని స్పష్టం చేసింది. రంజాన్, బక్రీద్, మొహర్రం, మిలాదినబీ వంటి పండగల తేదీల్లో మార్పులు ఉంటే తదుపరి తెలియజేస్తామని ఆయన తెలిపారు.
ఇక సాధారణ సెలవులను పరిశీలిస్తే...
క్రమ సంఖ్య | పండగ | తేదీ | వారం |
1 | న్యూ ఇయర్ | జనవరి 1 | శుక్రవారం |
2 | భోగి | జనవరి 13 | బుధవారం |
3 | సంక్రాంతి | జనవరి 14 | గురు |
4 | రిపబ్లిక్ డే | జనవరి 26 | మంగళవారం |
5 | మహా శివరాత్రి | మార్చి 11 | గురువారం |
6 | హోలీ | మార్చి 29 | సోమవారం |
7 | గుడ్ ఫ్రైడే | ఏప్రిల్ 2 | శుక్రవారం |
8 | బాబూ జగ్జీవన్ రామ్ జయంతి | ఏప్రిల్ 5 | సోమవారం |
9 | ఉగాది | ఏప్రిల్ 13 | మంగళవారం |
10 | బీఆర్ అంబేద్కర్ జయంతి | ఏప్రిల్ 14 | బుధవారం |
11 | శ్రీరామనవమి | ఏప్రిల్ 21 | బుధవారం |
12 | రంజాన్ | మే 14 | శుక్రవారం |
13 | రంజాన్ మరుసటి రోజు | మే 15 | శనివారం |
14 | బక్రీద్ | జూలై 21 | బుధవారం |
15 | బోనాలు | ఆగస్టు 2 | సోమవారం |
16 | స్వాతంత్ర్య దినోత్సవం | ఆగస్టు 15 | ఆదివారం |
17 | మొహర్రం | ఆగస్టు 19 | గురువారం |
18 | శ్రీ కృష్ణాష్టమి | ఆగస్టు 31 | మంగళవారం |
19 | వినాయక చవితి | సెప్టెంబర్ 10 | శుక్రవారం |
20 | గాంధీ జయంతి | అక్టోబర్ 2 | శనివారం |
21 | బతుకమ్మ ప్రారంభం | అక్టోబర్ 6 | బుధవారం |
22 | విజయదశమి | అక్టోబర్ 15 | శుక్రవారం |
23 | విజయదశమి మరుసటి రోజు | అక్టోబర్ 16 | శనివారం |
24 | మిలాద్ ఉన్ నబీ | అక్టోబర్ 19 | మంగళవారం |
25 | దీపావళి | నవంబర్ 4 | గురువారం |
26 | కార్తీక పౌర్ణమి /గురునానక్ జయంతి | నవంబర్ 19 | శుక్రవారం |
27 | క్రిస్మస్ | డిసెంబర్ 25 | శనివారం |
28 | బాక్సింగ్ డే | డిసెంబర్ 26 | ఆదివారం |