Charmme: చార్మీ పెంపుడు కుక్కతో ప్రభాస్... నెట్లో సందడి చేస్తున్న ఫొటో!

  • ప్రభాస్ ఫొటో పోస్టు చేసిన చార్మీ
  • అలాస్కన్ మలాముటే జాగిలంతో ప్రభాస్ దర్జా
  • గతంలో చార్మీతో రెండు చిత్రాలు చేసిన ప్రభాస్
Charmme posts Prabhas latest pic goes viral

హీరోయిన్ నుంచి నిర్మాతగా అవతారం ఎత్తిన చార్మీ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన ఫొటో పంచుకుంది. ఈ ఫొటోలో ప్రభాస్ ఉండడంతో నెట్టింట విపరీతంగా సందడి చేస్తోంది. ఈ ఫొటో గురించి చార్మీ ట్వీట్ చేసింది. 'తన 9 నెలల వయసున్న పెంపుడు కుక్కతో ప్రభాస్' అంటూ పేర్కొంది. ఓ విశాలమైన సోఫాలో కూర్చున్న ప్రభాస్... చార్మీకి చెందిన అలాస్కన్ మలాముటే జాతికి చెందిన జాగిలంతో రాజసం ఒలకబోయడం ఆ ఫొటోలో చూడొచ్చు.

ప్రభాస్ గతంలో చార్మీతో పౌర్ణమి, చక్రం చిత్రాల్లో నటించాడు. కాగా, ప్రభాస్ పూరీకనెక్ట్స్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ ఫొటోను క్లిక్ మనిపించినట్టు తెలుస్తోంది. ప్రభాస్... పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ చిత్రాల్లో నటించడం తెలిసిందే.

More Telugu News