Bandi Sanjay: బండి సంజయ్ కి ఫోన్ చేసిన అమిత్ షా

Amit Shah congratulates Bandi Sanjay

  • దుబ్బాక గెలుపుపై సంజయ్ కు అమిత్ షా అభినందన
  • అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన సంజయ్
  • శ్రీనివాస్ కు విజయాన్ని అంకితం చేస్తున్నామన్న సంజయ్

బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ దూకుడు పెంచింది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించడంతో బండి సంజయ్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సంజయ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. దుబ్బాకలో విజయం సాధించడంపై ఆయనను అభినందించారు. మరోవైపు, ఎన్నికల ప్రచారం సందర్భంగా సంజయ్ పై దాడి జరిగినప్పుడు కూడా ఆయనకు అమిత్ షా ఫోన్ చేశారు. దాడి వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం హైదరాబాదులోని బీజేపీ కార్యలయం వద్ద కోలాహలం నెలకొంది. రాష్ట్ర కీలక నేతలంతా కార్యాలయంలో ఉన్నారు. మరోవైపు అమరవీరుల స్తూపం వద్ద బండి సంజయ్ నివాళులు అర్పించారు. దుబ్బాక గెలుపును అమరవీరుడు శ్రీనివాస్ కు అంకితమిస్తున్నట్టు చెప్పారు.

Bandi Sanjay
Amit Shah
BJP
Dubbaka
  • Loading...

More Telugu News