Vikram: తాతయ్య హోదా పొందిన కథానాయకుడు విక్రమ్!

Vikram becomes grandfather

  • తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విక్రమ్
  • కూతురు అక్షితకు నేడు ఆడపిల్ల జననం  
  • 'అర్జున్ రెడ్డి' రీమేక్ ద్వారా ధృవ్ పరిచయం  

తమ అభినయంతో నిన్నటితరాన్ని ఉర్రూతలూగించి.. నేటి ట్రెండుకి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ నేటితరాన్ని కూడా ఆకట్టుకుంటున్న మన సీనియర్ హీరోలు ఒక్కొక్కరే తాతగా ప్రమోషన్ పొందుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ వంటి నిన్నటితరం హీరోలు తాత హోదా పొందారు.

ఇదే కోవలో తాజాగా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ నటుడు విక్రమ్ కూడా తాతగా మారారు. ఆయన కూతురు అక్షిత ఈ రోజు చెన్నైలో ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో విక్రమ్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. మూడేళ్ల క్రితం అక్షితను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి బంధువుల అబ్బాయి అయిన మను రంజిత్ కి ఇచ్చి విక్రమ్ వివాహం జరిపించారు.

ఇదిలావుంచితే, విక్రమ్ ప్రస్తుతం 'కోబ్రా', 'మహావీర్ కర్ణ', 'పొన్నియన్ సెల్వన్ వంటి చిత్రాలలో నటిస్తుండగా... ఆయన తనయుడు ధృవ్ 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ అయిన ఆదిత్య వర్మ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు.

Vikram
Dhruv
Chiranjeevi
Balakrishna
  • Loading...

More Telugu News