brazil: చైనా వ్యాక్సిన్‌ వికటించిన వైనం.. బ్రెజిల్‌లో ప్రయోగాల నిలిపివేత!

Brazil halts trials of Chinese  vaccine
  • చివరి దశ ప్రయోగాల్లో ఉన్న చైనా వ్యాక్సిన్‌ 'కరోనావాక్‌'
  • వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో దుష్ప్రభావాలు
  • అతి త్వరగా వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాలే కారణమని విమర్శలు
కరోనాతో వణికిపోతోన్న ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోన్న నేపథ్యంలో ఈ రేసులో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. చివరి దశలో ఉన్న చైనా వ్యాక్సిన్‌ 'కరోనావాక్‌' కు సంబంధించి బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రయోగాలు బెడిసికొట్టాయి.

వ్యాక్సిన్ వికటించడంతో ఆ ప్రయోగాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్న కొందరిలో దుష్ప్రభావాలు కనిపించాయని తెలిపింది. ఈ విషయంపై బ్రెజిల్ లోని సినోవాక్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ సంస్థ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి.

చైనా వ్యాక్సిన్ కోసం చేస్తోన్న ప్రయోగాల్లో ఇలా జరగటం ఇదే మొదటిసారి. వ్యాక్సిన్ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు బ్రెజిల్‌కు చెందిన  బయోమెడికల్ పరిశోధనా కేంద్రం బుటాంటన్‌ ఇన్‌స్టిట్యూట్‌ గత నెలలో ప్రకటన చేసింది. అయితే, ఇంతలోనే ఆ వ్యాక్సిన్ వికటించడం గమనార్హం. అతి త్వరగా వ్యాక్సిన్‌ కనుగొనే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తోంది.

ఎన్నో నియమాలను సడలించి మరీ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనాతో పాటు పలు దేశాల వ్యాక్సిన్లు వికటిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి వ్యాక్సిన్ల ప్రయోగాలు తుది దశకు చేరుకున్న సమయంలో వికటించిన విషయం తెలిసిందే.
brazil
China
vaccine
Corona Virus
COVID19

More Telugu News