TRS: టీఆర్ఎస్ ఎంపీ స్వగ్రామంలో అనూహ్యంగా బీజేపీకి మెజారిటీ!

BJP Mejority in TRS MP Native Village

  • మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి
  • పోతారంలో బీజేపీకి 110 ఓట్ల మెజారిటీ
  • ఐదు రౌండ్లు ముగిసేసరికి బీజేపీకి 3 వేల ఓట్ల మెజారిటీ

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ఫలితాలు అధికార టీఆర్ఎస్ కు షాకిస్తాయా? అంటే ప్రస్తుతానికి అలానే అనిపిస్తోంది. ఐదు రౌండ్ల కౌంటింగ్ ముగిసిన తరువాత, బీజేపీ అన్ని రౌండ్లలోనూ ఎంతో కొంత ఆధిక్యాన్ని చూపిస్తూ వచ్చింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మెజారిటీ 3 వేల ఓట్లకు అటూ ఇటుగా ఉన్నా, మరో 15 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే ఉండటంతో, ఈ పోరు హోరాహోరీగా సాగుతుందని, టీఆర్ఎస్ కు విజయం అంత సులువుకాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఆయన స్వగ్రామమైన పోతారంలో  బీజేపీ 110 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి నామమాత్రపు ప్రభావాన్నే చూపుతుండగా, ఒక్కో రౌండ్ ముగిసేకొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. రఘునందన్ రావుకు వస్తున్న మెజారిటీ భారీగా ఏమీ లేకపోవడంతో, తదుపరి రౌండ్లలో తాము పుంజుకుంటామన్న విశ్వాసాన్ని టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News