Bihar: బీహార్ లో పెరిగిన ఉత్కంఠ... ఆధిక్యంలో మహా ఘటబంధన్ కు దగ్గరగా ఎన్డీయే!

Tenssion in Bihar Elections

  • 109 చోట్ల ఎన్డీయే, 115 చోట్ల మహా ఘటబంధన్ ఆధిక్యం
  • 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎల్జేపీ
  • కింగ్ మేకర్ గా మారనున్న చిరాగ్

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతున్న కొద్దీ, ఉత్కంఠ పెరిగిపోతోంది. తొలి రౌండ్ కౌంటింగ్ లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన మహా ఘటబంధన్ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఆపై రెండు, మూడవ రౌండ్ ఫలితాలు వెల్లడయ్యే కొద్దీ వెనుకబడి పోయారు.

తాజా సమాచారం మేరకు ఎన్డీయే అభ్యర్థులు 109 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ 60 చోట్ల, జేడీయూ 42 చోట్ల, ఎన్డీయేలోని ఇతర పార్టీలు 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహా ఘటబంధన్ అభ్యర్థులు 115 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఆర్జేడీ 72 స్థానాల్లో కాంగ్రెస్ 31 స్థానాల్లో, సీపీఐ (ఎంఎల్) 7 చోట్లు, మహా ఘటబంధన్ లోని ఇతర పార్టీలు 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం సైతం ఒక స్థానంలో సత్తా చాటేలా కనిపిస్తోంది. ఫలితాల సరళి ఇలాగే కొనసాగితే, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఎల్జేపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో చిరాగ్ కింగ్ మేకర్ అవుతారా? అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News