Pragya Jaiswal: బాలకృష్ణ, బోయపాటి సినిమాకి కథానాయిక ఖరారు!

Pragya Jaiswal finalized for Balakrishna movie

  • బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో చిత్రం 
  • కథానాయికగా తాజాగా ప్రగ్య జైస్వాల్ ఎంపిక
  • మరో నాయికగా పూర్ణ ఇప్పటికే ఎంపిక    

బాలకృష్ణ, బోయపాటి కలయికలో రూపొందుతున్న మూడో చిత్రానికి కథానాయిక ఎంపిక ఓ పట్టాన తెమలడం లేదు. మొదటి నుంచీ కూడా ఇది సస్పెన్సుగానే కొనసాగుతోంది. ఎంతోమందిని పరిశీలించిన మీదట ఇటీవల మలయాళ భామ ప్రయాగ మార్టిన్ ని ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే, అంతలోనే ఆమె బాలయ్య పక్కన సరిపోవడం లేదంటూ, ఆమెను వద్దనుకున్నట్టు ప్రచారం జరిగింది.  

ఈ క్రమంలో తాజాగా ప్రగ్య జైస్వాల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. 'కంచె', 'మిర్చి లాంటి కుర్రోడు', 'గుంటూరోడు' వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ప్రగ్య ఎంపిక దాదాపు పూర్తయినట్టు చెబుతున్నారు. ఇటీవల టాలీవుడ్ లో కాస్త వెనుకపడిన ప్రగ్యకు కెరీర్ పరంగా ఈ అవకాశం హెల్ప్ అవుతుందనే చెప్పచ్చు.

ఇదిలావుంచితే, ఇందులో మరో కథానాయికగా మలయాళ సుందరి పూర్ణను ఇప్పటికే తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. 'సింహా', 'లెజండ్' వంటి హిట్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దీనికి ఎంతో క్రేజ్ ఏర్పడింది.

Pragya Jaiswal
Balakrishna
Boyapati Sreenu
  • Loading...

More Telugu News