Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలి: ప్రముఖుల ట్వీట్లు

wish you speedy recovery  chiru

  • చిరంజీవికి కరోనా
  • సినీ ప్రముఖుల స్పందన
  • తిరిగి పూర్తి ఎనర్జీతో రావాలని ట్వీట్లు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన  హోమ్  క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ఈ విషయం గురించి ట్వీట్ చేసిన వెంటనే ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు కోరుకుంటూ ట్వీట్లు చేశారు.

‘డ్యాడ్... మీరు త్వరగా కోలుకుంటారని, తిరిగి పూర్తి ఎనర్జీతో మా ముందుకు వస్తారని కోరుకుంటున్నాను’ అని సుస్మిత కొణిదెల పేర్కొంది. ‘గెట్ వెల్ సూన్ డ్యాడీ.. మీరు శరవేగంగా కోలుకోవాలి’ అని హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. ‘గెట్ వెల్ సూన్ మామయ్య’ అంటూ చిరు కోడలు ఉపాసన ట్వీట్ చేసింది.

‘మావయ్య మీరు త్వరగా కోలుకోవాలి.. జాగ్రత్తలు తీసుకోండి. మేమందరం మీవెంటే ఉన్నాం’ అని సాయి తేజ్ ట్వీట్ చేశాడు. ‘మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ధైర్యంగా ఉండండి సర్’ అంటూ  హీరో నితిన్ ట్వీట్ చేశాడు. ‘ఏడు రోజుల్లో మీకు నెగెటివ్ వస్తుంది’ అని నిర్మాత బండ్ల గణేశ్ పేర్కొన్నారు. ‘మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.. చిరు గారూ’ అని సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నాడు.

Chiranjeevi
Tollywood
sai tej
  • Loading...

More Telugu News