IYR Krishna Rao: ఏపీ సర్కారు ఇలాంటివి ఎన్ని వేల ఎకరాల భూములు వేలం వేయాల్సి ఉంటుందో?: ఐవైఆర్

iyr krishna rao slams ap govt

  • సర్కారు వారి భూముల వేలం
  • వాములు తినే స్వాములకు పచ్చి గడ్డి ఫలహారం అన్నట్లుంది
  • ఈ ప్రభుత్వం అలివి మాలిన ఎన్నికల వాగ్దానాలు చేసింది
  • వాటిని తీర్చటానికి వేల ఎకరాలు వేలం
  • అయినా ఆ వాగ్దానాలు నెరవేరే అవకాశం లేదు

‘సర్కారు వారి భూముల వేలం’ పేరిట ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ ఏపీ సర్కారుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు.  ‘వాములు తినే స్వాములకు పచ్చి గడ్డి ఫలహారం అన్నట్లు, ఈ ప్రభుత్వం చేసిన అలివి మాలిన  ఎన్నికల వాగ్దానాలు తీర్చటానికి ఇలాంటివి ఎన్ని వేల ఎకరాలు వేలం వేయాల్సి ఉంటుందో? వేసినప్పటికీ ఆ వాగ్దానాలు నెరవేరే అవకాశం కనిపించటం లేదు’ అని ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు.

కాగా, విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో సర్కారు భూముల విక్రయంపై ప్రకటన జారీ అయిందని ఈనాడులో పేర్కొన్నారు. పరిశ్రమలు, ఆసుపత్రి వంటి అవసరాలకు ప్రతిపాదించిన స్థలాలూ అమ్మకానికి పెట్టినట్లు తెలిపారు. వేలంలో ఎక్కువ ధరకు కొనుగోలు చేసినవారికే ఈ భూములు కేటాయిస్తామని ప్రకటన జారీ అయినట్లు అందులో పేర్కొన్నారు.  విశాఖపట్నం, గుంటూరు నగరాల పరిధిలో కోట్ల రూపాయల విలువైన సర్కారు భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని అందులో ఉంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News