Kajal Agarwal: హానీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన కాజల్, గౌతమ్!

Kajal and Gautam Enjoing Honeymoon at Mal Dives

  • ఇటీవల గౌతమ్ కిచ్లూతో వివాహం
  • దీపావళి నాటికి తిరిగి ఇండియాకు
  • ఆపై సినిమా షూటింగ్స్ కు వెళ్లనున్న కాజల్

ఇటీవల గౌతమ్ కిచ్లూని వివాహమాడిన అందాల తార కాజల్, హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్లింది. ప్రస్తుతం కాజల్, గౌతమ్ జంట మాల్దీవుల్లో ప్రశాంతమైన వాతావరణంలో వివాహం తరువాతి తొలి దినాలను గడుపుతున్నారు. హనీమూన్ కు వెళ్లడానికి ముందే తన సోషల్ మీడియా ఖాతాల్లో కాజల్ అగర్వాల్ అని ఉన్న పేరును కాజల్ కిచ్లూగా మార్చేసుకుంది.

అంతేకాదు, ఈ జంట ప్రత్యేక పాస్ పోర్ట్ కవర్ ను సైతం తయారు చేయించుకుంది. వీరిద్దరూ దీపావళి నాటికి హనీమూన్ ను ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తారని తెలుస్తోంది. ఆ తరువాత, తాను ఇప్పటికే అంగీకరించిన సినిమాలను కాజల్ పూర్తి చేస్తుందని సమాచారం. పెళ్లయిన తరువాత కూడా తాను సినిమాల్లో నటిస్తూనే ఉంటానని, పెళ్లి, తన కెరీర్ పై ఎటువంటి ప్రభావాన్నీ చూపబోదని కాజల్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Kajal Agarwal
Gautam Kichlu
Honeymoon
  • Loading...

More Telugu News