Priya Prakash: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Priya Prakash signs another film in Tolluwood

  • తెలుగులో ప్రియా ప్రకాశ్ మరో సినిమా 
  • బాబాయ్ తో కలసి నటిస్తున్న రానా
  • బీచ్ లో సేదదీరుతున్న కాజల్ జంట  

*  ప్రస్తుతం తెలుగులో నితిన్ సరసన 'చెక్' సినిమాలో కథానాయికగా నటిస్తున్న మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వరియర్ టాలీవుడ్ లో మరో ఛాన్స్ కొట్టేసింది. తేజ సజ్జ హీరోగా నూతన దర్శకుడు నాగరాజు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కథానాయికగా ప్రియా ప్రకాశ్ నటిస్తుందని తెలుస్తోంది. మలయాళం సినిమా 'ఇష్క్'కి రీమేక్ గా ఇది రూపొందుతుంది.
*  ప్రస్తుతం 'విరాటపర్వం' చిత్రంలో నటిస్తున్న రానా దగ్గుబాటి త్వరలో ఓ మల్టీ స్టారర్ చేయనున్నాడు. అందులో తన బాబాయ్ వెంకటేశ్, తను కలసి నటిస్తున్నట్టు తాజాగా రానా వెల్లడించాడు. లాక్ డౌన్ సమయంలో కొన్ని కథలు విన్నాననీ, వాటిలో బాబాయ్ తో చేసే సినిమా ఒకటని చెప్పాడు.
*  కొత్త పెళ్లికూతురు కాజల్ అగర్వాల్ ఇటీవల భర్తతో కలసి హనీమూన్ కి వెళుతున్నట్టుగా పేర్కొన్న సంగతి విదితమే. కానీ, ఎక్కడికి వెళుతున్నదీ ఆమె వెల్లడించలేదు. అయితే, ఈ జంట మాల్దీవులకు వెళ్లినట్టు, ప్రస్తుతం అక్కడి బీచ్ లో సేదదీరుతున్నట్టు తాజా సమాచారం.

Priya Prakash
Nithin
Rana Daggubati
Venkatesh
Kajal Agarwal
  • Loading...

More Telugu News