Milk Bath: మిల్క్ డెయిరీలో పాలతో స్నానం చేసిన ఘనుడు... కటకటాల వెనక్కి చేరాడు!

Turkish milk dairy worker baths with milk arrested

  • టర్కీలో ఘటన
  • ప్యాక్ చేయాల్సిన పాలతో స్నానం చేసిన కార్మికుడు
  • వీడియో తీసిన మరో కార్మికుడు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

పాలు ఎక్కడైనా నిత్యావసర వస్తువే. పాలు లేనిదే పనులు జరగవు మరి. పసిబిడ్డల నుంచి పెద్దల వరకు ఏదో ఒక రూపంలో పాలతో అవసరం ఉంటుంది. పల్లెటూళ్లలో గేదె పాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఫర్వాలేదు, పట్టణాలు, నగరాల్లో అత్యధికం ప్యాకెట్ పాలతోనే గడిచిపోతుంది. ఇక అసలు సంగతికొస్తే... టర్కీలో ఓ మిల్క్ డెయిరీలో జరిగిన సంఘటన అందరినీ నివ్వెరపరిచింది.

ఓ కార్మికుడు మిల్క్ డెయిరీలోని ఓ టబ్బులో పాలు నింపుకుని వాటితో ఎంచక్కా స్నానం చేశాడు. అతడు స్నానం చేస్తుంటే మరో కార్మికుడు వీడియో తీశాడు. టిక్ టాక్ లో ఈ వీడియో వైరల్ అయింది.  అయితే అతడు స్నానం చేసిన పాలనే మళ్లీ ప్యాకెట్లలో నింపాల్సి ఉండడంతో ఆ వీడియో చూసిన జనాలు మండిపడ్డారు. ఇలాంటి పాలనా తాము రోజూ తాగేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తుండడంతో పోలీసులు స్పందించి ఆ ఘనుడ్ని అరెస్ట్ చేశారు. వీడియో తీసిన వ్యక్తిని కూడా పోలీసులు వదల్లేదు. అంతేకాదు, ఇలాంటి చర్యలకు అవకాశమిస్తున్న ఆ మిల్క్ డెయిరీని మూసివేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News