CI Somasekhar: నంద్యాల ఆత్మహత్యల వ్యవహారంలో కీలక పరిణామం... సీఐ సోమశేఖర్ అరెస్ట్

Nandyal police arrest CI Somasekhar

  • కుటుంబంతో సహా తనువు చాలించిన ఆటోడ్రైవర్
  • సీఐ సోమశేఖర్ రెడ్డిపై ఆరోపణలు
  • ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసిన డిపార్ట్ మెంట్

నంద్యాలలో అబ్దుల్ సలాం అనే వ్యక్తి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సీఐ సోమశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. సీఐ సోమశేఖర్ రెడ్డిని ఇప్పటికే సస్పెండ్ చేసిన పోలీసు విభాగం తాజాగా అతడిని అరెస్ట్ చేసింది. సీఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సీఐపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు డీఐజీ వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.

అటు, ఈ వ్యవహారంపై ఇద్దరు సభ్యుల విచారణ కమిటీలో భాగంగా ఐజీ శంకబ్రత బాగ్చి కూడా నంద్యాల చేరుకున్నారు. ఆటోడ్రైవర్ అబ్దుల్ సలాం కేసుకు సంబంధించి కొందరు కానిస్టేబుళ్లను ఆయన ప్రశ్నించారు. గతేడాది నగల దుకాణంలో జరిగిన చోరీకి తనను బాధ్యుడ్ని చేస్తూ పోలీసులు వేధిస్తున్నారని, వారి బెదిరింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అబ్దుల్ సలాం ఓ సెల్పీ వీడియోలో చెప్పడంతో ఈ వ్యవహారంలో స్పష్టత వచ్చింది.

CI Somasekhar
Arrest
Police
Abdul Salam
Nandyal
  • Loading...

More Telugu News