Van Jones: బైడెన్ గెలిచారని ప్రకటిస్తూ, లైవ్ లో ఆనందబాష్పాలు రాల్చిన సీఎన్ఎన్ యాంకర్... వీడియో ఇదిగో!

CNN Host Breaks Down As Joe Biden Wins Viral Video

  • పెన్సిల్వేనియాలో విజయం సాధించగానే బ్రేకింగ్ న్యూస్
  • అమెరికాకు శుభదినమన్న యాంకర్ వాన్ జోన్స్
  • భావోద్వేగంతో వార్తను చదివిన జోన్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపు డొనాల్డ్ ట్రంప్ సహా రిపబ్లికన్లకు ఏ మాత్రం మింగుడు పడకపోయినా, సీఎన్ఎన్ యాంకర్ వాన్ జోన్స్ కు మాత్రం అమితానందాన్ని కలిగించినట్టుంది. బైడెన్ ఈ ఎన్నికల్లో గెలిచారన్న విషయాన్ని టీవీ ప్రేక్షకులకు చెబుతూ, ఆయన భావోద్వేగంతో ఆనంద బాష్పాలు కార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

బైడెన్ పెన్సిల్వేనియాలో విజయం సాధించి, మెజారిటీకి అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లను సాధించగానే, సీఎన్ఎన్ బ్రేకింగ్ న్యూస్ వేసింది. జో బైడెన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అంటూ, వార్తను ప్రసారం చేసింది. దీన్ని చదువుతున్న వాన్ జోన్స్, ఎంతో బాధించబడ్డ ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకోనున్నారు. కేవలం జార్జ్ ఫ్లాయిడ్ మాత్రమే కాదు. ఎంతో మంది ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అమెరికన్లమైన మనమందరికీ ఇప్పుడు శాంతి లభిస్తుంది. తిరిగి ఎదిగేందుకు అవకాశం లభిస్తుంది అంటూ కన్నీరు కార్చారు.

"ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని నా కుమారులకు చెబుతాను. దేశానికి ఇది శుభదినం. ఓడిపోయిన వారికి నా సానుభూతిని తెలుపుతున్నాను. వారికి మాత్రం ఇది మంచి రోజు కాకున్నా, చాలా మందికి ఇది మంచి రోజు" అని అన్నారు. వాన్ జోన్స్ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News