Joe Biden: ఫలితాల అనంతరం బైడెన్ తొలి ట్వీట్ ఇదే!

Joe Biden First Tweet After Results

  • ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
  • మన ముందున్న లక్ష్యాలు క్లిష్టతరం
  • నమ్మకాన్ని నిలుపుకుంటానన్న బైడెన్

యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా గత రాత్రి ఆయన స్పందిస్తూ, ఓ ట్వీట్ పెట్టారు. "అమెరికా... ఓ గొప్ప దేశానికి నాయకత్వం వహించే అవకాశం నాకు లభించడం ఎంతో గర్వకారణం. మన ముందున్న లక్ష్యాలు చాలా క్లిష్టతరమైనవి. అయినా, నేను హామీ ఇస్తున్నాను. నాకు ఓటు వేసినా, వేయకున్నా, అమెరికన్లు అందరికీ నేను అధ్యక్షుడిగా ఉంటా. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటా" అని వ్యాఖ్యానించారు.

కాగా, జో బైడెన్ తో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ ట్విట్టర్ ప్రొఫైల్స్ మారిపోవడం గమనార్హం. వీరిద్దరూ కాబోయే అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు అని తమ ప్రొఫైల్స్ మార్చేసుకున్నారు. అమెరికాను తిరిగి నిలిపేందుకు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బైడెన్ తెలిపారు.

Joe Biden
USA
President
  • Error fetching data: Network response was not ok

More Telugu News