Chamari Atapattu: లంక అమ్మాయి ఆటపట్టు విజృంభణ...  146 పరుగులు చేసిన సూపర్ నోవాస్

Chamari Atapattu registered a fifty

  • షార్జాలో మహిళల టీ20 చాలెంజ్
  • సూపర్ నోవాస్ తో ట్రెయిల్ బ్లేజర్స్ ఢీ
  • మొదట బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్
  • 67 పరుగులు చేసిన ఆటపట్టు

శ్రీలంక బ్యాట్స్ ఉమన్ చమారి ఆటపట్టు సూపర్ ఇన్నింగ్స్ సాయంతో సూపర్ నోవాస్ జట్టు భారీ స్కోరు సాధించింది. షార్జాలో జరుగుతున్న మహిళల టీ20 చాలెంజ్ లో భాగంగా నేడు సూపర్ నోవాస్ తో ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన సూపర్ నోవాస్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది.

ఓపెనర్ గా బరిలో దిగిన ఎడమచేతివాటం చమారి ఆటపట్టు 48 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 67 పరుగులు చేసింది. ఆటపట్టు అలవోకగా సిక్సర్లు బాదిన వైనం క్రికెట్ అభిమానులను అలరించింది. ఆటపట్టుకు తోడు మరో ఓపెనర్ ప్రియా పూనియా (30), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (31) రాణించారు. అయితే చివర్లో వెంటవెంటనే వికెట్లు పడడంతో స్కోరు కాస్త నిదానించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News