Nagarjuna: 'వైల్డ్ డాగ్'లో నా పని పూర్తయింది... ఇంటికి వెళుతున్నా: నాగార్జున

Nagarjuna completes his part in Wild Dog movie

  • 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్న నాగార్జున
  • హిమాలయాల్లో షూటింగ్
  • తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్ మూవీ

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' అనే తీవ్రవాద నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున విజయ్ వర్మ అనే ఎన్ఐఏ అధికారి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాలయ పర్వత ప్రాంతాల్లోని రోహ్ తంగ్ కనుమల్లో జరిగింది. నాగ్ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, 'వైల్డ్ డాగ్' చిత్రంలో తాను నటించే సన్నివేశాల షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. ఇక ఇంటికి వెళుతున్నానని తెలిపారు.

ఎంతో నైపుణ్యం ఉన్న తన చిత్రబృందానికి వీడ్కోలు పలకడం బాధగా ఉందని, పైగా హిమాలయాలను వదిలి వెళుతున్నందుకు విచారంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో నాగ్ సరసన దియా మీర్జా నటిస్తుండగా, సయామీ ఖేర్ కీలక పాత్ర పోషిస్తోంది.

Nagarjuna
Wild Dog
Himalayas
Rohtang
Shooting
Tollywood
  • Loading...

More Telugu News