Rapaka Vara Prasad: సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక

Janasena MLA Rapaka Varaprasad praises CM Jagan

  • జగన్ పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తి
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • జగన్ పాదయాత్ర చరిత్ర లిఖించిందన్న రాపాక

ఏపీ సీఎం జగన్ ప్రజాసంకల్ప యాత్ర పేరిట సాగించిన పాదయాత్రకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా సీఎంకు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ, నాడు జగన్ పాదయాత్ర మొదలుపెట్టిన సమయంలో ఆయన వెంట వైసీపీ కార్యకర్తలే ఉన్నారని, ఇవాళ ఆయన వెంటన రాష్ట్ర ప్రజలంతా ఉన్నారని కొనియాడారు. జగన్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ పాదయాత్ర ఎన్నో మార్పులకు బీజం వేసిందని తెలిపారు.

గత 17 నెలల పాలనలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కుల, మత, వర్గ రాజకీయాలను పక్కనబెట్టి ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. కాగా, రాపాక ఇవాళ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానితో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Rapaka Vara Prasad
Jagan
Padayatra
YSRCP
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News