Poonam Pandey: సినీ నటి పూనం పాండేను అరెస్ట్ చేసిన గోవా పోలీసులు

Actress Poonam Pandey arrested by Goa police

  • గోవాలోని డ్యాం వద్ద అసభ్యకర వీడియోను చిత్రీకరించిన పూనం పాండే
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన నీటి వనరుల శాఖ
  • స్టార్ హోటల్ లో ఉన్న పూనంను అరెస్ట్ చేసిన పోలీసులు

బాలీవుడ్ సినీ నటి పూనం పాండేను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ కట్టడాల వద్ద తిరగడమే కాకుండా... అక్కడ అసభ్యకరమైన వీడియోను షూట్ చేసిన నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర గోవాలోని సింక్వెరిన్ అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉన్న పూనంను పోలీసు బృందం అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పంకజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ప్రశ్నించడం కోసమే పూనం పాండేను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

పూనం పాండేపై నిన్న పోలీసు కేసు నమోదైంది. కనకోనా టౌన్ లో ఉన్న చపోలీ డ్యామ్ వద్ద ఫొటో షూట్ చేసిందంటూ గోవా రాష్ట్ర నీటి వనరుల శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును నమోదు చేశారు. ఇదే సమయంలో పట్టణంలో పలువురు పూనంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్స్ పెక్టర్ తుకారం చవాన్, మరో కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హామీ ఇవ్వడంతో స్థానికులు బంద్ ఆలోచనను విరమించుకున్నారు.

Poonam Pandey
Arrest
Goa
Video
  • Loading...

More Telugu News