Trail Blazers: మహిళల టీ20 చాలెంజ్: ఉసూరుమన్న మిథాలీ సేన... ట్రెయిల్ బ్లేజర్స్ అద్భుత విజయం

Trail Blazers won by nine wickets against Velacity

  • షార్జాలో స్వల్ప స్కోర్ల మ్యాచ్
  • 47 పరుగులకే ఆలౌటైన వెలాసిటీ
  • 7.5 ఓవర్లలో కొట్టేసిన ట్రెయిల్ బ్లేజర్స్

యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 చాలెంజ్ లో ఇవాళ వెలాసిటీ, ట్రెయిల్ బ్లేజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ 15.1 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌట్ కాగా, స్వల్ప లక్ష్యాన్ని ట్రెయిల్ బ్లేజర్స్ 7.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.

బ్లేజర్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ డయాండ్రా డాటిన్ 29 పరుగులతో అజేయంగా నిలిచింది. రిచా ఘోష్ 13 పరుగులు సాధించింది. కెప్టెన్ స్మృతి మంథన 6 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగినా, ఏమాత్రం తడబాటు లేకుండా డాటిన్, ఘోష్ మిగిలిన పని పూర్తి చేశారు.

కాగా, రేపు జరిగే మ్యాచ్ లో ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సూపర్ నోవాస్ తో తలపడనుంది.

Trail Blazers
Velacity
Sharjah
IPL 2020
  • Loading...

More Telugu News