Kangana Ranaut: ‘తలైవి’ కోసం 20 కిలోలు పెరగడంతో వెన్ను భాగం దెబ్బతింది: ఫొటోలు పోస్ట్ చేసిన కంగన

kangana pics go viral

  • జయలలిత బయోపిక్ లో నటిస్తోన్న కంగన
  • బరువు పెరిగాక భరత నాట్యం చేశానన్న అమ్మడు
  • బరువును తగ్గించుకోవడానికి చాలా కష్టపడ్డానని వ్యాఖ్య  

హీరోయిన్ కంగన రనౌత్ ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో జయలలితలా కనపడడానికి కంగన బాగా కష్టపడింది.

జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించాక చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా తీసిన సీన్ల కోసం ఆమె బరువు పెరగాల్సి వచ్చింది. ఇందుకోసం తాను 20 కిలోల బరువు పెరిగానని కంగన తెలిపింది. అంత బరువు పెరిగాక భరత నాట్యం చేయడం వల్ల తన వెన్ను భాగం దెబ్బతిందని ఆమె ట్వీట్ చేసింది. అనంతరం ఆ బరువును తగ్గించుకోవడానికి  చాలా కష్టపడ్డానని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. బరువు తగ్గేందుకు ఏడు నెలలకు మించి సమయం పట్టిందని చెప్పింది.

Kangana Ranaut
Bollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News