Sai Pallavi: ప్రముఖ దర్శకుడి చిత్రానికి 'నో' చెప్పిన సాయిపల్లవి?

Sai Pallavi says No to a noted director
  • మనసుకు నచ్చే పాత్రలే చేసే సాయిపల్లవి 
  • అనిల్ రావిపూడి చిత్రానికి 'నో' చెప్పిన వైనం
  • సాయిపల్లవి చేతిలో 'విరాటపర్వం', 'శ్యామ్ సింగ రాయ్'  
ప్రస్తుత మన కథానాయికల్లో సాయిపల్లవి ప్రత్యేకతే వేరు. మనసుకు నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తుంది. హోమ్లీ పాత్రలు మాత్రమే ఒప్పుకుంటుంది. గ్లామర్ వంకతో అందాలు ప్రదర్శించడానికి సుతరామూ ఇష్టపడదు. నచ్చకపోతే ఆ సినిమా చేయనని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. ఎంతటి వారికైనా అదే జవాబు చెబుతుంది.

అలాంటి సాయిపల్లవి తాజాగా ఓ ప్రముఖ దర్శకుడికి కూడా నో చెప్పిందట. ఆమధ్య మహేశ్ బాబుతో 'సరిలేరు నీ కెవ్వరు' వంటి భారీ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు సాయిపల్లవిని అడిగారట. అయితే, పాత్ర నచ్చకపోవడంతో ఆమె వెంటనే నో చెప్పేసిందని తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా ప్రచారంలో వుంది.

ఇదిలావుంచితే, తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగును పూర్తిచేసింది. మరోపక్క 'విరాటపర్వం', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలలో నటిస్తోంది. మరికొన్ని చిత్రాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
Sai Pallavi
Anil Ravipoodi
Dil Raju
Chaitanya

More Telugu News