Yuvraj Singh: గ్రేట్ ఇండియన్ బ్యాట్స్ మెన్: కోహ్లీపై యువరాజ్ ప్రశంసల జల్లు

Yuvraj Singhs Birthday Wish For Virat Kohli

  • నేడు 32వ జన్మదినాన్ని జరుపుకుంటున్న కోహ్లీ
  • ఎప్పుడూ సంతోషంగా ఉండు అంటూ యువీ గ్రీటింగ్స్
  • ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే ఉండాలని ఆకాంక్ష

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ ఈరోజు 32వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీకి యువరాజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'జన్మదిన్ ముబారక్ హో కింగ్ కోహ్లీ. ఇండియన్ గ్రేట్ బ్యాట్స్ మెన్ కి హ్యాపీ బర్త్ డే. ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే ఉండు. ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సాధిస్తుంది' అని యువీ ట్వీట్ చేశాడు. దీంతో పాటు కోహ్లీతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

ప్రస్తుతం ఐపీఎల్ కోసం విరాట్ కోహ్లీ యూఏఈలో ఉన్నాడు. కోహ్లీ నేతృత్వం వహిస్తున్న ఆర్సీబీ జట్టు లీగ్ దశను దాటుకుని... ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ఈ టోర్నీ ప్రారంభంలో తక్కువ స్కోర్లు చేస్తూ ఆర్సీబీ వెనుకబడిపోయింది. అయితే, కోహ్లీ ఒక్క సారిగా పుంజుకోవడంతో లీగ్ దశను నాలుగో స్థానంతో ముగించింది. లీగ్ దశలో 14 మ్యాచుల్లో కోహ్లీ 460 పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News