Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Keerti Suresh will join Mahesh movie in January

  • జనవరి నుంచి మహేశ్ సినిమాలో కీర్తి సురేశ్ 
  • నాగ చైతన్య సరసన కథానాయికగా రకుల్
  • మరోసారి తెరపై సూర్య, జ్యోతిక జంట సందడి  

*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి అమెరికాలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, తాను మాత్రం ఈ చిత్రం షూటింగులో జనవరి నుంచి పాల్గొంటానని ఆ చిత్ర కథానాయిక కీర్తి సురేశ్ పేర్కొంది.
*  అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు 'థ్యాంక్యూ' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వీరిలో ప్రియాంక అరుల్ మోహన్ ని ఇప్పటికే ఎంపిక చేయగా, మరో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైంది.
*  నిజజీవితంలో భార్యాభర్తలైన జ్యోతిక, సూర్య జంట త్వరలో ఓ సినిమా కోసం జతకట్టనుంది. 2006లో వివాహం తర్వాత వీరిద్దరూ కలసి నటించలేదు. మలయాళ చిత్ర దర్శకురాలు అంజలి మీనన్ దర్శకత్వంలో త్వరలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించనున్నట్టు తెలుస్తోంది.

Keerti Suresh
Mahesh Babu
Naga Chaitanya
Rakul Preet Singh
  • Loading...

More Telugu News