Tirumala: శ్రీవారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచిన టీటీడీ!

TTD Open SrivariMettu Path for Tirumala
  • మార్చి 20న మూతపడిన శ్రీవారిమెట్టు మార్గం
  • ప్రస్తుతానికి పగటిపూట మాత్రమే అనుమతి
  • భక్తులకు మరో నడకమార్గం అందుబాటులోకి
కరోనా, లాక్ డౌన్ కారణంగా మార్చిలో మూతబడిన తిరుమల శ్రీవారిమెట్టు నడకమార్గాన్ని టీటీడీ తిరిగి తెరిచింది. మార్చి 20న మూతపడిన మార్గాన్ని నేటి నుంచి తిరిగి తెరుస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే భక్తులను అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఇక తిరుమలలో రద్దీ క్రమంగా పెరుగుతోంది. కరోనాకు ముందున్న స్థాయికి భక్తుల సంఖ్య ఇప్పట్లో చేరే అవకాశాలు లేకపోయినా, నిత్యమూ తిరుమలకు వస్తున్న వారి సంఖ్య వేలల్లోనే ఉంది. అయితే, 10 నుంచి 60 సంవత్సరాలలోపు వయసున్న వారికే స్వామి దర్శనానికి అనుమతిస్తుండటంతో సకుటుంబ సమేతంగా భక్తులు దర్శనానికి రావడం లేదు.
Tirumala
Tirupati
Srivarimettu
Path
Open

More Telugu News