America: ఇండియా ‘ట్రెండ్స్’లో ట్రంపే టాప్.. కనిపించని బైడెన్

donald trump hashtag trends in india

  • వెలువడుతున్న ఫలితాలకు అనుగుణంగా నెటిజన్ల ట్వీట్లు
  • టాప్-10లో ట్రంప్, టాప్-29లో బైడెన్
  • గెలుపుపై ట్రంప్, బైడెన్‌ల ధీమా

అమెరికాతో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్న కారణంగా అక్కడ ఏం జరిగినా దానిపై భారతీయుల దృష్టి ఉంటుంది. ఇక ఎన్నికలైతే మరీనూ. భారత్‌కు అనుకూలమైన వ్యక్తి అధ్యక్షుడు కావాలని కోరుకుంటూ ఉంటారు. అందుకనే అక్కడ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ ప్రభావం, హడావుడి భారత్‌లోనూ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా, నిన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ హోరాహోరీగా తలపడుతున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.

గెలుపోటములు పక్కనపెడితే భారత్‌లో మాత్రం ఇప్పుడు ట్రంప్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగులో ఉంది. ఎప్పటికప్పుడు వెలువడుతున్న ఫలితాలపై నెటిజన్లు ట్వీట్ల వర్షం కురిపిస్తుండడమే ఇందుకు కారణం. ట్రంప్ ప్రత్యర్థి బైడెన్ హ్యాష్‌ట్యాగ్ మాత్రం పెద్దగా ట్రెండ్ కావడం లేదు. బైడెన్ హ్యాష్‌ట్యాగ్ టాప్-29లో ఉంటే, ట్రంప్ హ్యాష్‌ట్యాగ్ మాత్రం టాప్-10లో కొనసాగుతోంది. అయితే, అంతమాత్రాన వారంతా ట్రంప్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నవారని కాదు. అందులో ఆయన మద్దతుదారులు, వ్యతిరేకులు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News