Arnab Goswami: మీరు పప్పు సేన, సోనియా సేన.. అర్నాబ్ అరెస్ట్‌పై నటి కంగన మండిపాటు

Bollywood actor Kangana fires on Maha CM over Aranab arrest

  • 2018 నాటి కేసులో అర్నాబ్ అరెస్ట్
  • ఎంతమంది గొంతు నొక్కుతారంటూ మండిపడిన కంగన
  • భావాల్ని స్వేచ్ఛగా వెల్లడించిన ఎంతోమందిని ఉరితీశారన్న నటి

రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌ను బాలీవుడ్ ప్రముఖ నటి కంగన రనౌత్ తీవ్రంగా ఖండించింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, కంగన రనౌత్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. నేరుగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేనే టార్గెట్ చేస్తూ వచ్చిన కంగన తాజాగా మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నానని పేర్కొన్న కంగన.. ఎంతమంది గొంతులు కోస్తారు? ఎంతమంది గళాన్ని అణచివేస్తారు? ఎంతమందిని జుట్టు పట్టుకుని అవమానిస్తారని ప్రశ్నల వర్షం కురిపించింది. తమ భావాల్ని స్వేచ్ఛగా వెల్లడించిన ఎంతోమందిని ఉరితీశారని పేర్కొన్న కంగన ‘‘మీరు పప్పు సేన, సోనియా సేన’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ముంబైలో మే 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అన్వయ్ రాసిన ఆత్మహత్య లేఖ పోలీసులకు లభ్యమైంది. అర్నాబ్‌తో పాటు ఫెరోజ్ షేక్, నితీశ్ సర్దా అనే ఇద్దరు వ్యక్తులు తనకు 5.40 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇవ్వలేదని దీంతో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని అన్వయ్ అందులో రాశారు. ఈ కేసులోనే పోలీసులు అర్నాబ్‌ను అరెస్ట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News