Supernovas: ప్రారంభమైన మహిళల టీ20 చాలెంజ్.. టాస్ గెలిచిన వెలాసిటీ

Velocity won the toss and opt to bowl
  • షార్జాలో ప్రారంభమైన విమెన్ టీ20 చాలెంజ్
  • టైటిల్ కోసం పోటీపడనున్న సూపర్‌నోవాస్, వెలాసిటీ, ట్రయల్‌బ్లేజర్స్
  • 9న టైటిల్ పోరు
యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లీగ్ దశ పోటీలు నిన్నటితో ముగిశాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌లు  ప్రారంభానికి ముందు  షార్జాలో మహిళల జట్లు సందడి చేయనున్నాయి. విమెన్స్ టీ20 చాలెంజ్‌లో భాగంగా సూపర్ నోవాస్, వెలాసిటీ, ట్రయల్‌బ్లేజర్స్ జట్లు పోటీ పడనున్నాయి. వెలాసిటీకి సీనియర్ బ్యాట్స్‌విమెన్ మిథాలీరాజ్ సారథ్యం వహిస్తుండగా, ట్రయల్‌బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, సూపర్ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యం వహిస్తున్నారు. మరికాసేపట్లో సూపర్ నోవాస్, వెలాసిటీ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుండగా, వెలాసిటీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా, నేటి నుంచి 9వ తేదీ వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. 

సూపర్‌నోవాస్: ప్రియా పూనియా, చమరి అటపట్టు, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, శశికళ సిరివర్దెనె, తానియా భాటియా(వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, షకీరా సెల్మాన్, అయబోంగ ఖాక.

వెలాసిటీ: షఫాలీ వర్మ, డేనియల్ వైట్, మిథాలీ రాజ్, వేదా కృష్ణమూర్తి, సుష్మ వర్మ (వికెట్ కీపర్), సూనె లూస్, మనాలి దక్షిణి, షిఖా పాండే, ఎక్తా బిష్త్, లీ కాస్పెరెక్, జహనారా ఆలం.
Supernovas
Velocity
Trailblazers
Womens T20 Challenge

More Telugu News