Narendra Modi: ఇండియాకు పెట్టుబడులే లక్ష్యంగా... మోదీ కీలక సమావేశం!

Modi to Hold Investment Meeting with Fund Companies

  • 20కి పైగా కంపెనీలతో సమావేశం
  • పెట్టుబడి అవకాశాలను వివరించనున్న మోదీ
  • పలు కంపెనీలతో విడివిడిగానూ సమావేశం

ఇండియాకు మరిన్ని విదేశీ పెట్టుబడులు లక్ష్యంగా, 20కి పైగా దిగ్గజ సంస్థలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జపాన్, ఆస్ట్రేలియా, యూరప్, యూఎస్ ఫండ్ కంపెనీలు హాజరు కానుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని మోదీ నిర్వహించనున్నారు. ఇండియాలో పెట్టుబడిదారులకు లభించే అవకాశాల గురించి ఆయన వివరించనున్నారు. సమావేశం అనంతరం మోదీ విడివిడిగా ప్రతినిధులతో మాట్లాడతారు.

ఇక ఈ సమావేశానికి ఆస్ట్రేలియన్ సూపర్ అండ్ ఫ్యూచర్ ఫండ్, జపాన్ కు చెందిన పోస్ట్ బ్యాంక్ మరియు ఓంటారియో పెన్షన్ తదితర దిగ్గజ ఫండ్ కంపెనీలు హాజరు కానున్నాయి. కీలకమైన ప్రాజెక్టుల్లో అంతర్జాతీయ ఇన్వెస్టర్లను భాగం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగనుంది. కాగా, నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ పైప్ లైన్ లో భాగంగా, 7 వేల ప్రాజెక్టులను ఇప్పటికే గుర్తించామని, వాటిని గురించి మోదీ ప్రస్తావించనున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News