IPL 2020: ఐపీఎల్ బెట్టింగులో నష్టం.. పంజాగుట్టలో యువకుడి ఆత్మహత్య!

man suicide after loss in IPL betting In Hyderabad

  • నిమ్స్ సమీపంలో కొబ్బరిబొండాలు విక్రయిస్తూ జీవనం
  • ఐపీఎల్ బెట్టింగులతో తీవ్ర నష్టం
  • ఉరివేసుకుని ఆత్మహత్య

ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌పై బెట్టింగులు కాసిన ఓ యువకుడు నష్టాలపాలు కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఝార్ఖండ్‌కు చెందిన సోనుకుమార్ (19) పంజాగుట్టలోని నిమ్స్ సమీపంలో కొబ్బరిబొండాలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు.

ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి క్రికెట్ బెట్టింగులు కాస్తూ తీవ్రంగా నష్టపోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో వాటి నుంచి బయటపడలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నిన్న ఉదయం తానుంటున్న గదిలోని బాత్రూములో ఉరి వేసుకున్నాడు. బాధితుడి సోదరుడు అర్జున్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

IPL 2020
Cricket Betting
suicide
Jharkhand
Punjagutta
  • Loading...

More Telugu News