turkey: భూకంప శిథిలాల కింద నాలుగు రోజులు.. మృత్యుంజయురాలు ఈ చిన్నారి!

 3 year old rescued after 91 hours trapped under rubble in Turkey

  • శుక్రవారం టర్కీ, గ్రీస్‌లను కుదిపేసిన భారీ భూకంపం
  • కుప్పకూలిన భవనాలు
  • చిన్నారిని రక్షించి ఆసుపత్రికి తరలించిన సిబ్బంది

టర్కీ, గ్రీస్‌లలో ఐదు రోజుల క్రితం సంభవించిన భూకంపం ఎంతోమంది ప్రాణాలను హరించగా, మరెందరినో నిరాశ్రయులను చేసింది. అప్పటి నుంచి శిథిలాల తొలగింపులో తలమునకలుగా ఉన్న రెస్క్యూ సిబ్బందికి నిన్న ఆశ్చర్యపోయే ఘటన ఒకటి ఎదురైంది. టర్కీలోని ఇజ్మీర్‌లో ఓ అపార్ట్‌మెంట్ శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో మూడేళ్ల చిన్నారి సజీవంగా కనపడడంతో అందరూ ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.

పాప పేరు ఐదా గెజ్‌గిన్. శుక్రవారం సంభవించిన భూకంపం కారణంగా ఐదా నివసిస్తున్న ఎనిమిది అంతస్తుల భవనం కుప్పకూలింది. భూకంపం సమయంలో ఐదా తండ్రి, సోదరుడు భవనం లేరు. ఐదా తల్లి మాత్రం చనిపోయింది. భవన శిథిలాలను తొలగిస్తున్న సమయంలో చిన్నారి ఏడుపు వినిపించడంతో అప్రమత్తమైన సహాయక సిబ్బంది శిథిలాలను జాగ్రత్తగా పరిశీలించారు. ఈ క్రమంలో డిష్ వాషర్ పక్కన బలహీనంగా ఉన్న చిన్నారి కనిపించింది.

దాదాపు 91 గంటలుగా ఆమె అక్కడే అలా చిక్కుకుపోయి ఉండిపోయింది. చిన్నారిని రక్షించిన సిబ్బంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐదా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యపి ఎర్డోగాన్ ‘మిరాకిల్’, ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News