China: నేపాల్ భూమిని మేము ఆక్రమించుకోలేదు: చైనా

We have not occupied Nepals land says China
  • 150 హెక్టార్ల భూభాగాన్ని ఆక్రమించినట్టు డైలీ టెలిగ్రాఫ్ కథనం
  • ఈ కథనం నిరాధారమైనదన్న వాంగ్ వెన్ బిన్
  • అవన్నీ వదంతులే అని కొట్టివేత 
నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందంటూ పత్రికల్లో వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఆరోపణలపై చైనా స్పందించింది. ఈ కథనాలన్నీ నిరాధారమైనవని చైనా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా తప్పుడు కథనాలు రాస్తున్నాయని చెప్పారు.

నేపాల్ భూభాగంలోని 150 హెక్టార్లకు పైగా భూమిని చైనా రహస్యంగా ఆక్రమించుకుందని నేపాల్ రాజకీయ నాయకులు వ్యాఖ్యానించినట్టుగా 'డైలీ టెలిగ్రాఫ్' కథనాన్ని ప్రచురించింది. అక్టోబర్ 16న ఈ కథనాన్ని ప్రచురించింది. హుమ్లా జిల్లాలోని నేపాల్ భూభాగాన్ని ఆక్రమించి, కట్టడాలను నిర్మించినట్టు నేపాలీలు ఆరోపిస్తున్నారని డైలీ టెలిగ్రాఫ్ తెలిపింది. ఈ కథనంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరడంతో... వాంగ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. అవన్నీ వదంతులే అని చెప్పారు.
China
Nepal
Land
Grab

More Telugu News