Junior NTR: అయ్యో! నీకేమీ కాదు... అనారోగ్యంతో ఉన్న అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్

NTR video calls to ailing fan

  • తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకన్న అనే ఫ్యాన్
  • వెంకన్న పరిస్థితికి చలించిపోయిన ఎన్టీఆర్
  • వీడియో కాల్ చేసి సంతోషానికి గురిచేసిన వైనం

అభిమానుల క్షేమం కోసం పరితపించే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తన ఆడియో ఫంక్షన్లకు వచ్చే అభిమానులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలంటూ తప్పకుండా చెబుతుంటారు. తాజాగా, వెంకన్న అనే వీరాభిమాని తీవ్ర అనారోగ్యంపాలైన సంగతి తెలుసుకుని ఎన్టీఆర్ చలించిపోయారు. తన సిబ్బంది ద్వారా వెంకన్న సమాచారం తెలుసుకుని అతడికి వీడియో కాల్ చేశారు. స్వయంగా ఎన్టీఆర్ అంతటివాడు తనకు ఫోన్ చేయడం, అది కూడా వీడియో కాల్ చేయడంతో వెంకన్న ఆనందం అంతాఇంతా కాదు.

"మిమ్మల్ని ఇలా లైవ్ లో చూడడం సంతోషంగా ఉంది. ఇది మర్చిపోలేని రోజు" అని వెంకన్న సంతోషం వ్యక్తం చేశాడు. "మీరు ఒక్క సెల్ఫీ ఇస్తే చాలు... నాకు ఇంకేమీ వద్దు" అని వెంకన్న ఎన్టీఆర్ ను కోరాడు. అందుకు ఎన్టీఆర్ బదులిస్తూ... "కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత తప్పకుండా మనిద్దరం సెల్ఫీ దిగుదాం" అని హామీ ఇచ్చారు. అప్పటివరకు నువ్వు బలమైన ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో వెంకన్న... "మిమ్మల్ని కలవాలన్న ఒకే ఒక్క ఆశతో బతుకుతున్నా" అని తెలిపాడు.

ఆ అభిమాని సమాధానం ఎన్టీఆర్ హృదయాన్ని తాకింది. "అయ్యో... నీకు, నాకు ఏమీ కాదు... మనం ఇక్కడే ఉంటాం. నీ ఆరోగ్యంతో పాటు మీ అమ్మ గారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో" అని వ్యాఖ్యానించారు. ఆపై, వెంకన్న తల్లి కూడా ఎన్టీఆర్ తో ఫోన్లో మాట్లాడారు. తన కుమారుడి ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడో తిరిగామని, అయినా ఫలితం లేదని ఆమె వాపోయారు.

అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ... తప్పకుండా సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. "మీ అబ్బాయిని బాగా చూసుకోండి. నేను తప్పకుండా కలుస్తాను. నీ సంతోషమే నీకు రక్ష వెంకన్నా!" అని ఊరడించారు.

Junior NTR
Video Call
Venkanna
Ordent Fan
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News