Gutta Jwala: గుత్తా జ్వాలకు క్షమాపణలు చెప్పిన ప్రియుడు విష్ణు విశాల్!
- లాక్ డౌన్ సమయంలో విశాల్ తో ఎంగేజ్ మెంట్
- బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవానికి రాలేకపోయిన విశాల్
- క్షమించాలని కోరుతూ ట్విట్టర్ లో ట్వీట్
ఇటీవలి లాక్ డౌన్ లో బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, నటుడు విష్ణు విశాల్ ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గుత్తా జ్వాల రంగారెడ్డి జిల్లాలో బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించగా, కాబోయే భర్త విశాల్, ఆమెకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతూ, ఈ కార్యక్రమానికి తాను రాలేకపోయినందుకు క్షమించాలని కోరాడు.
"నీకు ఇది ఓ బిగ్ డే. గుత్తా జ్వాల అకాడమీ మొదలైంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద బ్యాడ్మింటన్ అకాడమీ. జ్వాలా ఐయామ్ సారీ. నేను హైదరాబాద్ కు రాలేకపోయాను. అందుకే నా స్నేహితులతో పాటు నా నుంచి నీకు శుభాకాంక్షలు. ఒక విషయం గుర్తుంచుకో... ఇది ప్రారంభం మాత్రమే" అని ట్వీట్ చేశాడు.
కాగా, మొయినాబాద్ లో జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మొత్తం 55 ఎకరాల విస్తీర్ణంలో 600 మంది సీటింగ్ కెపాసిటీతో ఇది ఉంటుంది. ఈ అకాడమీలో 14 ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు క్రికెట్ అకాడమీ, స్విమ్మింగ్ పూల్, యోగా, జిమ్ సెంటర్లు ఉంటాయి.