Varla Ramaiah: ఇక శేషాచలం అడవిని ఆ దేవుడే కాపాడుకోవాలి: వర్ల రామయ్య

varla slams jagan

  • ఎర్ర చందనం స్మగ్లర్లకు రాష్ట్రం స్వర్గ ధామంగా మారింది
  • అధికార గణం మామూళ్ల మత్తులో ఉంది
  • స్మగ్లర్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు 
  • ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు ఈ స్మగ్లింగ్ సూత్రధారి  

శేషాచలం అడవి నుంచి కొల్లగొట్టిన వృక్ష సంపదను తరలించే క్రమంలో ఓ గ్యాంగును మరో స్మగ్లింగ్ గ్యాంగు తరిమింది. దీంతో కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద ఇటీవల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆ అడవిలో మరోసారి స్మగ్లింగ్ కలకలం రేపుతోందని విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనను ప్రస్తావిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య పలు వ్యాఖ్యలు చేశారు.  

‘రాష్ట్రం, ఎర్ర చందనం స్మగ్లర్లకు స్వర్గ ధామంగా మారింది. అధికార గణం మామూళ్ల మత్తులో ఉంటే, స్మగ్లర్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు, నేర చరిత్ర కలిగిన ఆప్తుడు ఈ స్మగ్లింగ్ సూత్రధారి అని చాలామందికి తెలుసు. ఇక, శేషాచలం అడవిని ఆ దేవుడే కాపాడుకోవాలి’ అని వర్ల రామయ్య చెప్పారు.

Varla Ramaiah
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News